Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

మార్నింగ్ టిఫిన్‌ను లైట్ తీసుకుంటున్నారా.. భారీ మూల్యం తప్పదు..

Skipping Breakfast Is harmful To Health, మార్నింగ్ టిఫిన్‌ను లైట్ తీసుకుంటున్నారా.. భారీ మూల్యం తప్పదు..

స్మార్ట్ యుగంలో చాలామంది యువత పనుల హడావుడి, అలసత్వంతో ఉదయం పూట టిఫిన్‌ను ఎగ్గొడుతుంటారు. అలాగే రాత్రి సమయాల్లో కూడా డిన్నర్ లేట్‌‌గా చేస్తుండటం కామన్ అయిపొయింది. అయితే ఇలా ప్రొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ చేయడం.. నైట్ ఆలస్యంగా భోజనం చేయటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

చద్దన్నం, ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్, ఉడకపెట్టిన కూరగాయలు, ఫ్రూట్స్.. ఇలా చాలామంది చాలా రకాలుగా తమకు నచ్చినవి ప్రొద్దున్న టిఫిన్‌గా తింటుంటారు. అయితే ఈ స్పీడ్ యుగం వల్ల చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై ఇలా ఉదయం టిఫిన్‌ చేయకపోవడం, రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా హార్ట్ పేషెంట్స్ ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళు తొందరగా చనిపోయే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది.

Skipping Breakfast Is harmful To Health, మార్నింగ్ టిఫిన్‌ను లైట్ తీసుకుంటున్నారా.. భారీ మూల్యం తప్పదు..

ఇలా రెండు పూట్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసు ఉన్న 113 మంది హార్ట్ పేషెంట్స్‌ను పరీక్షించిన సైంటిస్టులు.. వారి రోజువారీ అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వీరిలో టిఫిన్ తినని వారు 58 శాతం ఉండగా.. రాత్రి పూట భోజనం లేటుగా చేసేవారు 51 శాతం ఉన్నారు. అంతేకాకుండా ఈ రెండు చెడలవాట్లు కలిగిన వారు 48 శాతం మంది ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని కూడా స్పష్టమైంది. దీంతో ప్రజలు ఇప్పటికైనా మేలుకొని.. బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయకుండా.. నైట్ భోజనం తొందరగా తినేలా అలవాట్లను మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం మంచిదని వారి సలహా.