ఐసీయూగా మారిన షారూక్‌ ఆఫీస్‌.. కరోనా రోగులకు సేవలు అందించేలా

కరోనా వేళ చాలా మంది హీరోలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తూ

ఐసీయూగా మారిన షారూక్‌ ఆఫీస్‌.. కరోనా రోగులకు సేవలు అందించేలా
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 8:11 AM

Shah Rukh Khan office in Mumbai: కరోనా వేళ చాలా మంది హీరోలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తూ రియల్ హీరోలుగా పేరొందుతున్నారు. వీరిలో బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ ఒకరు. ముంబయిలోని తన ఆఫీస్‌ని కరోనా రోగుల కోసం ఆయన ఇచ్చేశారు. ఇక ఇప్పుడు ఆ ఆఫీస్‌ని ఐసీయూగా మార్చేశారు. జూలైలో ఐసీయూగా మార్చేందుకు పనులు ప్రారంభం కాగా., ఇటీవల పూర్తయ్యాయి. ఇందులో 15 పడకలను అమర్చారు. షారూక్‌కి చెందిన మీర్ ఫౌండేషన్‌, ఖార్‌ లోని హిందూజ ఆసుపత్రి, ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త సహకారంతో ఈ ఐసీయూకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా హిందూజ సూపరింటెండెంట్‌ డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ.. ఐసీయూలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, నాజల్‌ ఆక్సిజన్ మెషీన్లు, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్‌లు ఉంచామని అన్నారు. పరిస్థితి విషమంగా మారిన రోగులకు సైతం సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఐసీయూను ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందూజ ఆసుపత్రి నిర్వహిస్తోందని తెలిపారు. ఇక షారూక్‌ చేసిన ఈ చర్యపై అటు అభిమానులతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read This Story Also: వైరస్‌ రూపాంతరం.. ఏడాదికో కొత్త వ్యాక్సిన్‌ కావాల్సిందేనా!