జాతీయ బ్యాడ్మింటన్ నేటి నుంచే

గువాహటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల ఆకర్షణ నడుమ జాతీయ టోర్నీ మంగళవారం ప్రారంభంకానుంది. గతేడాది ఫైనల్లో హోరాహోరీ పోరాటంతో ఆకట్టుకున్న సింధు, సైనా మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు. నాలుగో సారి జాతీయ ఛాంపియన్‌గా నిలవాలని సైనా.. మూడో మారు ట్రోఫీ అందుకోవాలని సింధు పట్టుదలగా ఉండటంతో వీరిద్దరి పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహిళల సింగిల్స్‌లో సింధు టాప్‌ సీడ్‌గా..సైనా రెండో సీడ్‌గా బరిలో దిగుతున్నారు. […]

జాతీయ బ్యాడ్మింటన్ నేటి నుంచే
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:40 PM

గువాహటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ల ఆకర్షణ నడుమ జాతీయ టోర్నీ మంగళవారం ప్రారంభంకానుంది. గతేడాది ఫైనల్లో హోరాహోరీ పోరాటంతో ఆకట్టుకున్న సింధు, సైనా మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నారు. నాలుగో సారి జాతీయ ఛాంపియన్‌గా నిలవాలని సైనా.. మూడో మారు ట్రోఫీ అందుకోవాలని సింధు పట్టుదలగా ఉండటంతో వీరిద్దరి పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహిళల సింగిల్స్‌లో సింధు టాప్‌ సీడ్‌గా..సైనా రెండో సీడ్‌గా బరిలో దిగుతున్నారు.

పురుషుల సింగిల్స్‌లో గతేడాది ఫైనలిస్టులు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. ఈ ఇద్దరి గైర్హాజరీతో సమీర్‌ వర్మ, సాయి ప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌ టైటిల్‌ రేసులోకొచ్చారు. గతేడాది ఈ టోర్నీ ఫైనల్లో సింధును ఓడించిన సైనా.. ఆ తర్వాత కామన్వెల్త్‌ క్రీడల టైటిల్‌ పోరులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. దీంతో ఈసారి ఎలాగైనా సైనాపై గెలవాలని సింధు పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో ఫైనల్‌ చేరితే ఇద్దరి మధ్య పోరు మరోసారి అభిమానులను కనువిందు చేస్తుందనడంలో సందేహం లేదు. టోర్నీ నిబంధనల ప్రకారం ప్రపంచ 50వ ర్యాంకులోపు ఉన్న టాప్‌ ఎనిమిది మంది షట్లర్లు నేరుగా ప్రీక్వార్టర్స్‌ నుంచి బరిలోకి దిగుతారు. దీంతో మహిళల సింగిల్స్‌ నుంచి సింధు, సైనా, శ్రేయాంశి పర్దేశి, అష్మిత, కనిక కన్వాల్‌, అరుణ ప్రభుదేశాయ్‌, సాయి ఉత్తేజితరావు, ఆకర్షి కశ్యప్‌.. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ, సాయి ప్రణీత్‌, కశ్యప్‌, శుభాంకర్‌ డే, అన్సల్‌ యాదవ్‌, చిరాగ్‌ సేన్‌, బోధిత్‌ జోషి, కార్తీక్‌ జిందాల్‌ ప్రీక్వార్టర్స్‌తో తమ పోరును ఆరంభించనున్నారు. మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. బుధవారం నుంచి మెయిన్‌ డ్రా పోటీలు జరుగుతాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు