టీ20 ప్రపంచకప్‌లో ధోని ఆడాలిః కుంబ్లే

Selectors Must Think Twice On Dhoni Future, టీ20 ప్రపంచకప్‌లో ధోని ఆడాలిః కుంబ్లే

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు ఇంకా తెరబడలేదు. ప్రస్తుతం అమెరికాలో సేదతీరుతున్న ధోని రిటైర్మెంట్‌పై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ధోనిని ఆడించాలనుకుంటే ఇప్పటి నుంచే అతడిని రెగ్యులర్ ఆటగాడిగా జట్టుతో పాటే ఉంచాలని బీసీసీఐకు విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే గౌరవంగానే జట్టు నుంచి సాగనంపాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

ధోని రిటైర్మెంట్ అంశంపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడు వీడ్కోలు చెబుతాడో తెలియదు. కాబట్టి.. ధోని భవితవ్యంపై సెలెక్టర్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. టీ20 ప్రపంచకప్‌లో ధోనిని ఆడించాలని భావిస్తే.. ఇప్పటి నుంచే రెగ్యులర్‌గా అతడిని జట్టులో స్థానం కల్పించాలి. అలా కాకుండా యువ క్రికెటర్లు అవకాశం ఇవ్వాలని అనుకుంటే.. ధోనికి గౌరవంగా వీడ్కోలు చెప్పండి. భారత జట్టుకి ఎన్నో అపురూప విజయాల్ని అందించిన ధోని గౌరవమైన వీడ్కోలుకి అర్హుడు’ అని కుంబ్లే పేర్కొన్నాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌కు ధోనిని ఎంపిక చేయని సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చే క్రమంలోనే ధోని జట్టుకు దూరంగా ఉన్నాడని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ఆ సమయంలో పేర్కొన్నాడు. అయితే ధోనిని తప్పించాలనే నిర్ణయం సెలెక్టర్లదేనని చాలామంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో అనిల్ కుంబ్లే స్పందించడంతో ఆ విమర్శలకు మరింత బలాన్ని చేరుకుస్తోంది. ఇక గతంలో కూడా కొంతమంది మాజీ క్రికెటర్లకు గౌరవమైన వీడ్కోలు ఇవ్వలేదు బీసీసీఐ. జట్టులో రాజకీయాలు, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికి నచ్చిన క్రికెటర్లకే అవకాశాలు ఇస్తున్నారని ట్విట్టర్‌లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *