శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లపై సీలింగ్

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లపై టీటీడీ సీలింగ్ విధించింది. ఇకపై రోజుకు ఆన్ లైన్ లో వెయ్యి కల్యాణం టికెట్లు మాత్రమే విక్రయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో, 10 రోజుల పాటు కల్యాణోత్సవ సేవను రద్దు చేశామని చెప్పారు. తిరిగి 26వ తేదీ నుంచి కల్యాణోత్సవ సేవ టికెట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ అమ్ముడు పోయాయని తెలిపారు. […]

శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లపై సీలింగ్
Follow us

|

Updated on: Oct 06, 2020 | 10:11 AM

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లపై టీటీడీ సీలింగ్ విధించింది. ఇకపై రోజుకు ఆన్ లైన్ లో వెయ్యి కల్యాణం టికెట్లు మాత్రమే విక్రయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో, 10 రోజుల పాటు కల్యాణోత్సవ సేవను రద్దు చేశామని చెప్పారు. తిరిగి 26వ తేదీ నుంచి కల్యాణోత్సవ సేవ టికెట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ అమ్ముడు పోయాయని తెలిపారు. కరోనా లాక్ డౌన్ అనంతరం రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి మరింత మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సోమవారం నుంచి 14వ తేదీ వరకు, 25వ తేదీ నుంచి 31 వరకు అదనంగా రెండు స్లాట్లల్లో మూడువేల మంది దర్శనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాత్రి 9, 10 గంటల స్లాట్లు కేటాయించారు. కల్యాణోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న టీటీడీ, టికెట్ కొనుగోలు చేసిన వారికి తదుపరి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కల్యాణోత్సవానికి డిమాండ్ పెరిగింది. ఈ నెల 3వ తేదీన శనివారం నాడు 4,300కు పైగా కల్యాణోత్సవం టికెట్లు అమ్ముడుపోయాయి.