Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

School van catches fire :స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవ దహనం

School van catches fire : Four kids burnt to death as school van catches fire in Punjab's Sangrur district, School van catches fire :స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవ దహనం

School van catches fire : పంజాబ్​లోని సంగ్రూర్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లంగోవల్ సిద్ సమాచార్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ మినీ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 8 మంది పిల్లలను స్థానికులు అద్దాలు పగలగొట్టి రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది పిల్లలు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరూ కూడా 10 నుంచి 12 ఏళ్ల వయసువారే కావడం మరింత బాధించే విషయం. అయితే అగ్నికీలలు ఎగిసిపడగానే డ్రైవర్ డోర్ తీసేందుకు విఫలయత్నం చేసినప్పటికి..అది లాక్ అయిపోవడం వల్ల చిన్నారుల ప్రాణాలు మంటలకు ఆహుతయ్యాయి. స్కూల్‌కి వెళ్లి తిరిగివస్తారనుకున్న పిల్లలు బూడిదగా మిగిలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్​ సింగ్ సింగ్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ..ప్రమాదంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Related Tags