చెల్లి మూవీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

నటన పరంగా.. డ్యాన్స్ పరంగా సాయిపల్లవి మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు సహా అన్ని భాషల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రేజీ బ్యూటీ సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి కూడా ఉందన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం పూజా కన్నన్, హీరో ధనుష్ ఫొటో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయిపల్లవి చెల్లి పూజా కూడా సినిమాలు చేస్తోందనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. అయితే ఆ వార్తకు చెక్ పెడుతూ.. […]

చెల్లి మూవీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2019 | 4:41 PM

నటన పరంగా.. డ్యాన్స్ పరంగా సాయిపల్లవి మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు సహా అన్ని భాషల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రేజీ బ్యూటీ సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి కూడా ఉందన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం పూజా కన్నన్, హీరో ధనుష్ ఫొటో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయిపల్లవి చెల్లి పూజా కూడా సినిమాలు చేస్తోందనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. అయితే ఆ వార్తకు చెక్ పెడుతూ.. ఈ వార్తలో నిజం లేదని చెప్పారు సాయిపల్లవి. అది పూజా ధనుష్ సరదాగా తీసుకున్న ఫొటో అని చెప్పింది. అయినా.. పూజా ఇప్పుడు  మెడిసన్ చేస్తుంది. చదువుపైనే పూర్తి దృష్టి పెట్టిందనీ, నటనపైపుకు వచ్చే ఉద్ధేశం ఆమెకి లేదని సాయిపల్లవి అంది.