రేటింగ్‌లలో సరికొత్త రికార్డును సాధించిన సడక్‌ 2

ఇలాంటి చిత్రరాజాన్ని జీవితంలో చూసి ఉండమంటూ ప్రేక్షకులు జండూబామ్‌ రాసుకుంటున్నారు! చూసినవారికి రక్తకన్నీరే అని ఎకసెక్కాలాడుతున్నారు కొందరు....

రేటింగ్‌లలో సరికొత్త రికార్డును సాధించిన సడక్‌ 2
Follow us

|

Updated on: Aug 29, 2020 | 5:58 PM

ఇలాంటి చిత్రరాజాన్ని జీవితంలో చూసి ఉండమంటూ ప్రేక్షకులు జండూబామ్‌ రాసుకుంటున్నారు! చూసినవారికి రక్తకన్నీరే అని ఎకసెక్కాలాడుతున్నారు కొందరు.. ఈ ముచ్చటంతా సడక్‌ 2 సినిమా గురించి.. రెండు దశబ్దాల కిందట ఘన విజయాన్ని సాధించిన సడక్‌ సినిమాకు ఇది సీక్వెలంటున్నారు కానీ ఆ ఛాయలేమీ లేవని అంటున్నారు ప్రేక్షకులు.. మహేశ్‌భట్‌ దర్శకత్వంలో వచ్చిన సడక్‌ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌! సంజయ్‌దత్‌, పూజాభట్‌ల యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు జనం.. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన సడక్‌ 2 కు కూడా మహేశ్‌భటే డైరెక్టర్‌.. సంజయ్‌దత్‌ కూడా ఉన్నాడిందులో.. అలియాబట్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, జిషుసేన్‌ గుప్తా, గుల్షన్‌ గ్రోవర్‌, మకరంద్‌ దేశ్‌పాండే వంటి నటులు కూడా కనిపిస్తారిందులో! ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచే ఈ సినిమా నెగటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. బాలీవుడ్‌లో నెలకొన్న నెపోటిజం కారణంగానే సుశాంత్‌సింగ్ చనిపోయాడన్న గట్టి నమ్మకంతో ఉన్న ప్రేక్షకులు ట్రైలర్‌ను ఓ ఆటాడుకున్నారు. డిస్‌లైక్స్‌తో చెత్త రికార్డును తెచ్చిపెట్టారు.. ఇప్పుడు సినిమా కూడా అంతే! కనీసం ఫర్వాలేదన్న వారు కూడా కరువయ్యారు ఈ సినిమాకి! ఈ ఏడాది అత్యంత చెత్త సినిమాగా రికార్డులలో నిలిచిపోనుంది.. ఐఎండీబీ ఈ సినిమాకు ఇచ్చిన రేటింగ్‌ ఎంతనుకుంటున్నారు? పదికి 1.1 ఇచ్చి ఇది చాలుపో అనేసింది.. ఐఎండీబీ చరిత్రలోనే ఇది అత్యంత తక్కువ రేటింగ్‌. ఇంతకు ముందు అజయ్‌దేవగణ్‌ నటించిన హిమ్మత్‌వాలాకు 1.7 రేటింగ్‌ ఇచ్చిన ఐఎండీబీ రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఫైర్‌కు 1.7 ఇచ్చింది. ఇక అభిషేక్‌ బచ్చన్‌ నటించిన లెజెండ్‌ ఆఫ్‌ డ్రోనాకు రెండు పాయింట్లు ఇచ్చింది ఐఎండీబి.. వీటికంటే తక్కువ రేటింగ్‌ను సాధించి సడక్‌ 2 సరికొత్త రికార్డును సంపాదించుకుంది.. సినిమానే బోరంటే పాటలు మరింత బోర్‌ అంటున్నారు ప్రేక్షకులు.. ఇక సుప్రసిద్ధ సినీ విమర్శకుడు తరుణ్‌ ఆదర్శ్‌ అయితే చిత్రానికి 1/5 రేటింగ్‌ ఇచ్చాడు.. కొందరు జీరో కూడా ఇచ్చారనుకోండి.. పాపం తరుణ్‌కు జీరో ఇవ్వడానికి మొహమాటం అడ్డొచ్చినట్టుంది..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు