Diwali Wishes: ‘సాల్ ముబారక్’, ప్రపంచ వ్యాప్త ప్రజలకు జో బైడెన్, కమలా హారిస్ దీపావళి శుభాకాంక్షలు.. వెల్లువెత్తిన ట్వీట్లు

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న కమలా హారిస్ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది హిందువులు, సిక్కులు, జైనులు,  బుద్ధిస్టులు ఈ పండుగను ఆనందోత్సాహాలతో..

Diwali Wishes: 'సాల్ ముబారక్', ప్రపంచ వ్యాప్త ప్రజలకు జో బైడెన్, కమలా హారిస్ దీపావళి శుభాకాంక్షలు.. వెల్లువెత్తిన ట్వీట్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 15, 2020 | 10:43 AM

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న కమలా హారిస్ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది హిందువులు, సిక్కులు, జైనులు,  బుద్ధిస్టులు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దీపాల మాదిరే వారి జీవితాలు ఎప్పుడూ కాంతులీనుతూ ఉండాలని బైడెన్ ట్వీట్ చేశారు. అలాగే కమలా హారిస్ కూడా గతరాత్రి దీపావళి గ్రీటింగ్స్ తెలిపారు. ‘సేఫ్, హెల్దీ, జాయిస్ న్యూ ఇయర్’ అని ట్వీట్ చేశారు. ‘సాల్ ముబారక్’ అంటూ ఇద్దరూ ఉర్దూలో కూడా తమకు అభినివేశం ఉందని నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా ‘కమల’..ఇండియాకు చెందిన తనతల్లిని తలచుకున్నారు. నేనీ రోజున ఇక్కడ ఉన్నానంటే అది అది మాతల్లి శ్యామలా గోపాలన్ చలవే అని ఈ మధ్యే ఆమె భావోద్వేగంతో స్పందించారు.

ఇలా ఉండగా జో బైడెన్ క్రమంగా వైట్ హౌస్ లో కాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రంప్ నిన్న ఇక దాదాపు తన ఓటమిని ఒప్పుకుంటున్నట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆయన వేదాంతం వల్లె వేశారు.