Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • టీవీ9తో హేమంత్‌ సోదరుడు. మా అన్నకు జరిగిన అన్యాయం మరొకరికి మళ్లీ జరగొద్దు. పెళ్లైనప్పటినుంచీ వదిన బంధువులు బెదిరిస్తూనే ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా నిందితులు బెదిరింపులకు దిగారు. వాళ్లే మారతారు, వదిలేద్దాం అని అవంతి చెబుతూ వచ్చింది. చిత్రహింసలు పెట్టి అవంతి కుటుంబసభ్యులు దారుణంగా చంపారు. హత్యకేసు నిందితుల నోటితోనే మీడియాకు నిజాలు చెప్పించాలి. కాలయాపన లేకుండా మా కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలి. -టీవీ9తో హేమంత్‌ సోదరుడు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

ఐపీఎల్‌ను బహిష్కరించండి.. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్

చైనా కంపెనీలకు మద్దతు పలుకుతున్న ఐపీఎల్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ మండిపడుతోంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందిని ఆ సంస్థ కో కన్వినర్‌ అశ్వినీ మహాజన్‌ అన్నారు.

rss affiliate wants bcci to reconsider ipl chinese sponsorship deals, ఐపీఎల్‌ను బహిష్కరించండి.. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్

చైనా కంపెనీలకు మద్దతు పలుకుతున్న ఐపీఎల్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ మండిపడుతోంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందిని ఆ సంస్థ కో కన్వినర్‌ అశ్వినీ మహాజన్‌ అన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19న మొదలయ్యే ఐపీఎల్‌-13వ సీజన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో కంపెనీ సహా పలు చైనా కంపెనీలకు ఉద్వాసన పలకాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇటీవల గాల్వాన్ ఘటనలో అమరులైన వీర జవాన్ల సంఘీభావంగా దేశం యావత్తు నిలిచింది. చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా కంపెనీలను, వస్తువులను నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చైనా సంస్థలతో కొనసాగేందుకు బీసీసీఐ ప్రయత్నించడం సరైంది కాదని విమర్శించారు మహాజన్. దేశ ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామని ఆయన అన్నారు.

Related Tags