తస్మాత్ జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే రూ. 5.10 లక్షలు మాయం!

సైబర్ క్రైమ్‌పై ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చినా.. కేటుగాళ్లు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. టెక్నాలజీని వాడి నేరాల్లో  దూసుకెళ్లిపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తూ.. పలు నేరాలకు అడ్డగా వాడుకుంటున్నారు. తాజాగా.. ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. ఇదివరకు మన ఫోన్స్‌‌ని.. హ్యాంగ్ చేసి ఓటీపీతో మనకు తెలియకుండానే బ్యాంకుల్లో డబ్బులు పోయేవి. కానీ.. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా పోయింది. తెలియని వారే మోసపోతున్నారంటే.. ఈ అదనపు టెక్నాలజీతో […]

తస్మాత్ జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే రూ. 5.10 లక్షలు మాయం!
Follow us

| Edited By:

Updated on: Dec 18, 2019 | 11:10 AM

సైబర్ క్రైమ్‌పై ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చినా.. కేటుగాళ్లు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. టెక్నాలజీని వాడి నేరాల్లో  దూసుకెళ్లిపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తూ.. పలు నేరాలకు అడ్డగా వాడుకుంటున్నారు. తాజాగా.. ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. ఇదివరకు మన ఫోన్స్‌‌ని.. హ్యాంగ్ చేసి ఓటీపీతో మనకు తెలియకుండానే బ్యాంకుల్లో డబ్బులు పోయేవి. కానీ.. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా పోయింది. తెలియని వారే మోసపోతున్నారంటే.. ఈ అదనపు టెక్నాలజీతో ఎంతో చదువు ఉన్న వారు కూడా మోస పోతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది.

మొబైల్ నెంబర్‌కు ఓటీపీ రాకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షల 10 వేలు మాయమయ్యాయి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని అయిన పి జయలక్ష్మి ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం తీర్థయాత్రలకని వెళ్లిన ఆమె.. అవి ముగిసిన తర్వాత ముంబాయిలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. అనంతరం ఇటీవల ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాస్ బుక్ తీసుకుని బ్యాంకుకు వెళ్లారు. పాస్‌బుక్‌ చెక్ చేపించగా అందులోని వివరాలు చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దాదాపు ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా డబ్బు డ్రా చేసినట్టు ఉంది. కానీ డబ్బులు డ్రా చేసిప్పుడు ఆమెకు మెసేజ్ కానీ, ఓటీపీ కానీ రాకపోవడం గమనార్హం. దీంతో ఆమె బ్యాంకు అధికారులను నిలదీయగా.. మాకు కూడా తెలీదని చెప్పారు. ఇక వెంటనే ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles