Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

బోరబండలో ఫ్యాక్షన్ హత్య..రౌడీ షీటర్ హతం

Rowdy Shheter murder in Borabonda, బోరబండలో ఫ్యాక్షన్ హత్య..రౌడీ షీటర్ హతం

హైదరాబాద్ లో ఫ్యాక్షనిజం పడగవిప్పుతోందా..? అంటే అవుననే అనిపిస్తోంది…ఎందుకంటే ఈ మధ్య కాలంలో నడిరోడ్లపై కత్తి దాడులు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. రౌడీలు కత్తులతో వీర విహారం చేస్తున్నారు. ప్రత్యార్థులను అందరూ చూస్తుండగానే హత్యచేసి బాహాటంగానే తిరుగుతున్నారు. బోరబండ సమీపంలోని అల్లాపూర్ లో నర్సింహదాస్ అనే వ్యక్తిని అతిదారుణంగ హత్యాచేశారు గుర్తు తెలియని వ్యక్తులు.  అర్ధరాత్రి సమయంలో సుమారుగా 20 మంది వ్యక్తులు నర్సింహదాస్ వెంటపడి మరి కత్తులతో డాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కత్తులు, పలుగు రాళ్లు, గ్రానైట్ రాళ్లతో రౌడీషీటర్ పై దాడి చేసి హతమార్చినట్లుగా తేల్చారు.  తీవ్రంగా గాయపడిన నర్సింహదాస్ అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అయితే, మృతుడు నర్సింహదాస్ అలియాస్ పోచి రౌడీషీటర్ గా గుర్తించిన పోలీసులు.. అతనిపై సనత్ నగర్, ఎస్ ఆర్ నగర్ తోపాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. పోచీ  హత్యకు పాత కక్షలే కారణంగా భావిస్తున్నారు పోలీసులు.