బీజేపీ గూటిలోకి ‘ఆప్‌’ తిరుగుబాటు నేత!

మాజీ మంత్రి, ఆప్‌ తిరుగుబాటు నేత కపిల్‌ మిశ్రా బీజేపీలో చేరారు. ఆప్‌ మహిళా విభాగం చీఫ్‌ రిచా పాండేతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు, ఢిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్‌ మిశ్రాపై గతంలోనే శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన […]

బీజేపీ గూటిలోకి 'ఆప్‌' తిరుగుబాటు నేత!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:37 PM

మాజీ మంత్రి, ఆప్‌ తిరుగుబాటు నేత కపిల్‌ మిశ్రా బీజేపీలో చేరారు. ఆప్‌ మహిళా విభాగం చీఫ్‌ రిచా పాండేతో కలిసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజు, ఢిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్‌ మిశ్రాపై గతంలోనే శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో తనపై అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. గతంలోనే ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు చేయడంతో ఆయన భాజపాలో చేరతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2017లో కపిల్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించారు. అప్పట్నుంచే కపిల్‌ మిశ్రా ఢిల్లీ భాజపా నేతలతో టచ్‌లో ఉంటూ వారితో కలిసి బహిరంగ వేదికల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన భాజపాలో చేరారు.