కిడ్నీలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే..!

రోజురోజుకు పెరిగిపోతున్న కిడ్నీ వ్యాధులపై అవగాహన తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లో అవగాహన రన్‌ను నిర్వహించారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కేర్ హాస్పిటల్, జీవన్ దాన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో జరిగిన వాక్‌థాన్‌లో వందలాది మంది పాల్గొన్నారు. ఒక్కసారి వస్తే నయం కాని కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నినాదాలు చేశారు. ఆధునిక జీవితంలో వస్తున్న మార్పుల వల్ల కూడా కిడ్నీ రోగాలు పెరిగిపోతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని కిడ్నీలు […]

కిడ్నీలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే..!
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 3:07 PM

రోజురోజుకు పెరిగిపోతున్న కిడ్నీ వ్యాధులపై అవగాహన తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లో అవగాహన రన్‌ను నిర్వహించారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కేర్ హాస్పిటల్, జీవన్ దాన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో జరిగిన వాక్‌థాన్‌లో వందలాది మంది పాల్గొన్నారు. ఒక్కసారి వస్తే నయం కాని కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నినాదాలు చేశారు. ఆధునిక జీవితంలో వస్తున్న మార్పుల వల్ల కూడా కిడ్నీ రోగాలు పెరిగిపోతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని కిడ్నీలు 90 శాతం పాడైన తర్వాతనే గుర్తించగలమని.. అందుకనే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుంటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చన్నారు.

ప్రతీ వ్యక్తి తన శరీరంలో జరిగే మార్పులను గమనించి ముందుగానే.. కిడ్నీ ఫెయిల్యూర్‌ను గుర్తిస్తే చికిత్స చేసే అవకాశం ఉందన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కిడ్నీలలో కొన్ని వ్యాధులు పుట్టుకతోనే వస్తాయని అన్నారు. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ ఒక్కసారి మొదలయితే.. దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్నారు వైద్యులు.