వారసత్వ రాజకీయాల వల్లే మేము ఓడిపోయాం – రాహుల్

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న అంతర్గత సమావేశం నిర్వహించింది.. కాగా ఆ రోజున పార్టీ సీనియర్ నేతలందరూ కూడా రాహుల్‌లోని మరో వ్యక్తిని చూడాల్సి వచ్చింది. ఇప్పటివరకూ వారు చేసే ఒత్తిళ్లను.. బెదిరింపులను ప్రస్తావించని రాహుల్.. తొలిసారి అందుకు భిన్నంగా నిప్పులు చెరిగారట. ఎవరికి వారు వారి ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప.. పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదని సీనియర్ నేతలపై మండిపడ్డారని […]

వారసత్వ రాజకీయాల వల్లే మేము ఓడిపోయాం - రాహుల్
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 5:21 PM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న అంతర్గత సమావేశం నిర్వహించింది.. కాగా ఆ రోజున పార్టీ సీనియర్ నేతలందరూ కూడా రాహుల్‌లోని మరో వ్యక్తిని చూడాల్సి వచ్చింది. ఇప్పటివరకూ వారు చేసే ఒత్తిళ్లను.. బెదిరింపులను ప్రస్తావించని రాహుల్.. తొలిసారి అందుకు భిన్నంగా నిప్పులు చెరిగారట. ఎవరికి వారు వారి ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప.. పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదని సీనియర్ నేతలపై మండిపడ్డారని తెలుస్తోంది.

ఆ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ పార్టీ ఓటమికి తాను బాధ్యత తీసుకుంటున్నట్లు చెబుతూనే.. వైఫల్యంలో పార్టీ సీనియర్ నేతల బాధ్యత కూడా ఉందని ఆరోపించినట్లు సమాచారం. వారసుల ఎదుగుదలే ముఖ్యమని భావించిన కొందరు సీనియర్ నేతల ధోరణిని రాహుల్ సునిశితంగా రాహుల్ ఎండగట్టినట్లు పార్టీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి చిదంబరం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

తన కొడుకు కార్తీకి టికెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని చిదంబరం బెదిరించారని.. అటు ఛింద్వారాలో కొడుకును గెలిపించడం కోసం అశోక్ గెహ్లాట్ పార్టీ ప్రచారాన్ని పక్కన పెట్టి జోద్‌పూర్ మకాం పెట్టేశారని.. ఇలా ఎవరికి వారు వాళ్ళ వారసత్వపు రాజకీయాల మీద దృష్టి పెట్టడం తప్ప.. పార్టీని పట్టించుకోలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.

ఇక తన కొడుక్కి టికెట్ తెచ్చుకోలేకపోతే తాను ముఖ్యమంత్రిగా ఉండటంలో అర్థం లేదని కమల్ నాథ్ కూడా పేర్కొంటూ.. తనపై తెచ్చిన విపరీతమైన ఒత్తిడిని  కూడా ఈ సమావేశంలో రాహుల్ ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా ఎవరికి వారు తమ పిల్లలు, తమ బంధువులు ముఖ్యమనుకుంటునప్పుడు..ప్రజలకు మనం ఏమి చెబుతామని ఆయన వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ కూడా పలుమార్లు కల్పించుకుని పార్టీ ఓటమికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం లేదని రాహుల్ చెప్పగా.. నేతలంతా ముక్త కంఠంతో ఉండాలని కోరినట్లుగా చెబుతున్నారు.

Latest Articles