తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్

తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ హైకోర్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ఇప్పటి నుంచి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కార్యాలయ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కలకత్తా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా బదిలీ అయిన తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ స్థానంలో […]

తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 7:14 PM

తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ హైకోర్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ఇప్పటి నుంచి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కార్యాలయ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కలకత్తా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా బదిలీ అయిన తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ స్థానంలో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ చీఫ్ జస్టిస్ కార్యాలయ వ్యవహారాలను చేపడతారని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.