అన్నదాతల నిరసనల్లో మరో ‘మలుపు’, పంజాబ్ లో బీజేపీ నేత ఇంటి ముందు వారు ఏం వేశారంటే ? సీఎం ఆగ్రహం

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు పంజాబ్ లో రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు టెలికం టవర్లను ధ్వంసం చేస్తూ..

అన్నదాతల నిరసనల్లో మరో 'మలుపు', పంజాబ్ లో బీజేపీ నేత ఇంటి ముందు వారు ఏం వేశారంటే ? సీఎం ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2021 | 11:27 AM

Farmers Protest:రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు పంజాబ్ లో రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు టెలికం టవర్లను ధ్వంసం చేస్తూ, కేబుల్ వైర్లను కట్ చేస్తే, తాజాగా మరికొందరు ఓ బీజేపీ నేత ఇంటిముందు ఆవుపేడ పోసి నిరసన తెలిపారు. హోషియార్ పూర్ లో మాజీ మంత్రి, బీజేపీ నాయకుడైన తిక్షన్ సూద్ ఇంటి ముందు ట్రాక్టర్లలో తెచ్చిన ఆవు పేడను  వారు గుమ్మరించారు. కేంద్రానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి. సూద్ మద్దతుదారులకు మధ్య తలెత్తిన ఘర్షణను నివారించడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది.. రైతుల చర్యను ఖండిస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూద్ ధర్నాకు దిగారు. సీఎం అమరేందర్ సింగ్ కూడా రైతుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఢిల్లీ శివార్లలో అన్నదాతలు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే మీరిలా నిగ్రహం కోల్పోయి వ్యవహరించడాన్ని తాను సహించబోనన్నారు. మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ కుమార్ శర్మ కూడా ఈ రైతుల చర్యను ఖండిస్తూ ప్రకటన చేశారు.

Read More:

అన్నదాతల నిరసనల్లో మరో ‘మలుపు’, పంజాబ్ లో బీజేపీ నేత ఇంటి ముందు వారు ఏం వేశారంటే ? సీఎం ఆగ్రహం

ప్రొద్దటూరు టీడీపీ నేత హత్య కేసులో కొత్త కోణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్బయ్య సతీమణి అపరాజిత

AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ.. ఆరు నెలలు పాటు..