Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

‘ మహా ‘ ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు

The five-star Buena Vista resort in Jaipur boasts of several luxurious facilities., ‘ మహా ‘ ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు

 

మహారాష్ట్రలో తలెత్తిన ‘ రాజకీయ సంక్షోభం ‘ ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి వరంగా మారింది. వారిని బీజేపీ, ఇతర పార్టీలు ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు పార్టీ నాయకత్వం రాజస్థాన్.. జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టుకు తరలించింది. (నిధుల కొరతతో అల్లల్లాడుతున్న రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేల ‘ భోగాల ‘ సంగతి పట్టనట్టు ఉంది). జైపూర్ లోని లగ్జరియస్ రిసార్ట్ లో ఈ శాసన సభ్యులు సుమారు మూడు రోజులుగా కనీవినీ ‘ అతిథి మర్యాదలు ‘ పొందుతున్నారు.

The five-star Buena Vista resort in Jaipur boasts of several luxurious facilities., ‘ మహా ‘ ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు

జైపూర్-ఢిల్లీ హైవేకి 1.5 కి. మీ, దూరంలో ఉన్న ఈ బ్రహ్మాండమైన అతిథి గృహంలో గది అద్దె రోజుకు రూ. 1.2 లక్షలట. ప్రతి విల్లాకు ప్రత్యేక స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. బార్లు, స్పా.. ఒకటేమిటి ?ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయని తెలుస్తోంది.
ఇందులో ఈ ఎమ్మెల్యేలతో పృథ్వీ రాజ్ చవాన్, అశోక్ చవాన్, మల్లిఖార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి పార్టీ సీనియర్ నేతలు సమావేశాలు జరుపుతున్నారు. ఇక ఈ శాసన సభ్యులు ఎక్కడికి వెళ్లినా వీరి వెంట పోలీసు బలగాలు ఉంటున్నాయి. వీరు రాష్ట్రంలోని ఏ టూరిస్టు స్పాట్ కు వెళ్లినా ఆ ఖాకీలూ వెన్నంటి ఉండాల్సిందే.. ఒక విధంగా చెప్పాలంటే వీరి మీద ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు.

The five-star Buena Vista resort in Jaipur boasts of several luxurious facilities., ‘ మహా ‘ ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు