తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఘనస్వాగతం పలికిన సీఎం జగన్

తిరుమల శ్రీవారి దర్శనంకోసం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతికి తిరుపతిలో స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అమారావతి నుంచి

  • Venkata Narayana
  • Publish Date - 11:18 am, Tue, 24 November 20

తిరుమల శ్రీవారి దర్శనంకోసం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి చేరుకున్నారు. రాష్ట్రపతికి తిరుపతిలో స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అమారావతి నుంచి ఈ ఉదయం బయలు దేకరి కొంచెం సేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రేణిగుంటకు జగన్ చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి స్వాగత సత్కారాల అనంతరం జగన్.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఇలాఉండగా, ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లనున్న రాష్ట్రపతి దంపతులు, పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నానికి తిరుమలకు వెళ్లనున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సాయంత్రం తిరిగి రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.