Gutha Sukender Reddy: అదునుచూసి దెబ్బకొట్టిన శాసనమండలి చైర్మన్ గుత్తా.. బయటపడ్డ బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కోపం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీనియర్ నేతలు పార్టీని వీడిన సమయంలో గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారయిందని ఆయన విమర్శించారు.

Gutha Sukender Reddy: అదునుచూసి దెబ్బకొట్టిన శాసనమండలి చైర్మన్ గుత్తా.. బయటపడ్డ బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు
Gutha Sukendar Reddy On Kcr
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2024 | 3:13 PM

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కోపం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీనియర్ నేతలు పార్టీని వీడిన సమయంలో గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారయిందని ఆయన విమర్శించారు. లీల్లిపుట్లను కేసీఆర్ తయారు చేశాడని విమర్శించారు. పార్టీ నేతల అహంకారంతో బీఆర్ఎస్ అధికారంతోపాటు ప్రజలకు దూరమైందని అన్నారు. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు.

బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం, సమీక్షించుకునే విధానం లేదుః గుత్తా

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, గెలుపోటములపై సమీక్షించుకునే విధానం, సంస్థాగత నిర్మాణం లేదని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమిపై నేటికీ సమీక్ష లేదని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితిని కేసీఆర్ కు వివరించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదని ఆయన అన్నారు. పార్టీలో గ్రామస్థాయి నుంచి నిర్మాణమే లేదని కమిటీలన్నీ నామ మాత్రమేనని ఆయన విమర్శించారు. శాసనమండలి చైర్మన్ గా ఉన్న తనకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు నెలలుగా కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గుత్తా ధ్వజమెత్తారు.

కేసీఆర్ జిల్లాలో లిల్లీపుట్ల తయారీ..!

రాష్ట్రంలో లిల్లీపుట్లు రాజ్యమేలుతున్నారన్న కేసీఆర్.. నల్లగొండ జిల్లాలో కూడా కొందరు లిల్లీపుట్లను తయారు చేశారని గుత్తా విమర్శించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరే.. ఆయనను నేతలు, ప్రజల కలవకుండా చేస్తుందోని అన్నారు. చాల జిల్లాల్లో లిల్లీపుట్ లు కేసీఆర్ తయారు చేశారని, ఆ నేతల అహంకారంతో అధికారం, ప్రజలకు పార్టీ దూరమైందని విమర్శించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వారే ఇతర నేతలపై తప్పుడు మాటలు చెప్పారని ఆయన ధ్వజమెత్తారు. ఈ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు.

ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే కొంపముంచాయి

ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ ను కొంపముంచాయని గుత్తా సుఱేకందర్ అన్నారు. ఈ విధానం వల్లనే బీఎస్పీ మాదిరిగానే బీఆర్ఎస్ తయారయిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మాటలే అధినేత విన్నారని, ఇతర నేతలను విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే లీడర్లు పార్టీని వీడుతున్నారని ఆయన చెప్పారు.

తనకు ఉచితంగా పదవులు ఇవ్వలేదు…

బీఆర్ఎస్ లో తనకు ఉచితంగా పదవులు రాలేదని సుఖేందర్ రెడ్డి అన్నారు. 16 సార్లు కేసీఆరే రిక్వెస్ట్ చేస్తే, తెలంగాణవాదిగా, ఎంపీగా ఇద్దరు ఎమ్మెల్యేలు, జడ్పీటిసి లతో కేబినెట్‌లో బెర్త్ హామీతో బీఆర్ఎస్‌లో చేరానని తెలిపారు. పార్టీలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పదవులు ఇచ్చామని కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా కొందరు అడ్డంకులు సృష్టించారని ఆయన విమర్శించారు.

ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి కోట్లు గడించారుః గుత్తా

ఉద్యమకారుల పేరుతో కొందరు బీఆర్ఎస్ లో గల్లాలు ఎగరవేస్తున్నారని అన్నారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాల మంది కోటీశ్వరులు అయ్యారని అన్నారు. ఒకప్పుడు 500 రూపాయలు అడుక్కున్న నేతలు, పప్పు బఠాణీలు అమ్ముకునే వాళ్ళు కోట్లకు పడగలేత్తారని విమర్శించారు. తనను విమర్శించే బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి, వారి బండారాన్ని అవసరమైన సమయంలో బయట పెడతానని హెచ్చరించారు. నాపై హత్య, క్రిమినల్ కేసులు లేవని, కిందిస్థాయి నుంచి రాజకీయంగా ఎదిగానని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.

బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతోనే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని సుఖేందర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్ ఏం జరుగుతుందో అమితే నిర్ణయించుకుంటాడని ఆయన్ చెప్పాడు. ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నాం, న్యాయపరమైన చిక్కులు లేకుండా సమీక్షిస్తున్నామని సుఖేందర్ రెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…