నా పేరు జగన్.. నేను ఏపీ ముఖ్యమంత్రిని..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ను గుర్తించడంలేదా.. జగన్ విజయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారా.. లేక జగన్ ను కలిసేందుకు వారికి మొహం చెల్లడం లేదా.. సునామీని తలపించేలా విజయ కేతనం ఎగురవేసిన జగన్ ను ఇంతవరకూ వాళ్ళు ఎందుకు కలవలేదు? కనీసం అభినందనలు కూడా చెప్పలేదు.. అసలేం జరుగుతోంది? ఇది తెలుసుకునే పనిలోనే పడింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధించినా స్వయంగా వెళ్ళి అభినందించడం సినీ పరిశ్రమకు ఆనవాయితీ. తెలంగాణలో సీఎం కేసీఆర్ విజయకేతనం […]

నా పేరు జగన్.. నేను ఏపీ ముఖ్యమంత్రిని..!
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2019 | 2:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ను గుర్తించడంలేదా.. జగన్ విజయాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారా.. లేక జగన్ ను కలిసేందుకు వారికి మొహం చెల్లడం లేదా.. సునామీని తలపించేలా విజయ కేతనం ఎగురవేసిన జగన్ ను ఇంతవరకూ వాళ్ళు ఎందుకు కలవలేదు? కనీసం అభినందనలు కూడా చెప్పలేదు.. అసలేం జరుగుతోంది? ఇది తెలుసుకునే పనిలోనే పడింది ఏపీ ప్రభుత్వం.

రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధించినా స్వయంగా వెళ్ళి అభినందించడం సినీ పరిశ్రమకు ఆనవాయితీ. తెలంగాణలో సీఎం కేసీఆర్ విజయకేతనం ఎగురవేసినప్పుడు సినీ పరిశ్రమ పెద్దలంతా వెళ్ళి అభినందనలు తెలిపారు. ఇక చంద్రబాబుకి, తెలుగు సినీ పరిశ్రమకీ ఉన్న అనుబంధం గురించి చెప్పనే అక్కర్లేదు. గతంలో చంద్రబాబు సీఎం అయినప్పుడు గానీ, తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎం అయినప్పడుగానీ పరుగు పరుగున వెళ్ళి అభినందించిన టాలీవుడ్ పెద్దలు.. ఇప్పుడు ఏపీవైపు కన్నెత్తి చూడటంలేదు. ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు.

జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండు నెలలు అయినా సినీ పరిశ్రమలో ఎవరూ జగన్ ను కలిసింది లేదు, అభినందించిన పాపాన పోలేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చూ.. జగన్ ను సీఎంగా గుర్తించడానికి వాళ్లకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జగన్ గెలుపు జీర్ణించుకోలేకపోతున్నారా.. మొహం చెల్లడంలేదా.. అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.

అటు మా అసోసియేషన్ కానీ, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ నుంచి గానీ ఎవరూ జగన్ అభినందించే ప్రయత్నమే చేయలేదు ఇంతవరకు. దీని వెనుక ఎవరున్నారని ఆరా తీసే పనిలో పడ్డాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. జగన్ సీఎం అయ్యాక పూర్తి సమయం పాలనమీదే ఫోకస్ పెట్టడంతో అప్పట్లో ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. ఆ తర్వాత అయినా వచ్చి కలుస్తారని చూసినా ఎవరూ రాకపోవడంతో ఈ ఎపిసోడ్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరన్నదానిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!