మోదీ విదేశాంగ విధానం మారుతుందా ?

రెండో సారి ప్రధాని పదవిని చేపట్టబోతున్న మోదీ అనుసరించే విదేశాంగ విధానం ఎలా ఉండనుంది ? ఇక ఈ పాలసీ ఎలా మారనుంది ? ఇప్పటివరకు ఆయన పలు విదేశీ పర్యటనలు చేశారు. వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అయితే ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్దగా పురోగతి లేదు. ప్రస్తుతం గల్ఫ్ లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కాస్త ‘ అటూ-ఇటూ ‘ గా ఉంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి మనకు 60 శాతం […]

మోదీ  విదేశాంగ విధానం మారుతుందా ?
Follow us

|

Updated on: May 24, 2019 | 5:44 PM

రెండో సారి ప్రధాని పదవిని చేపట్టబోతున్న మోదీ అనుసరించే విదేశాంగ విధానం ఎలా ఉండనుంది ? ఇక ఈ పాలసీ ఎలా మారనుంది ? ఇప్పటివరకు ఆయన పలు విదేశీ పర్యటనలు చేశారు. వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అయితే ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్దగా పురోగతి లేదు. ప్రస్తుతం గల్ఫ్ లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కాస్త ‘ అటూ-ఇటూ ‘ గా ఉంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి మనకు 60 శాతం ఆయిల్ దిగుమతులు జరుగుతున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు కూడా సందేహాస్పదంగా ఉన్న నేపథ్యంలో మోడీ ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పైగా,,భారత్-అమెరికా మధ్య టారిఫ్ వార్ కూడా కొనసాగుతోంది యూఎస్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత ప్రభుత్వం సుంకాలు పెంచడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. . అలాగే అమెరికా-చైనా మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య ఈ రెండు దేశాలూ దీనిపై దాదాపు టగ్ ఆఫ్ వార్ కొనసాగిస్తున్నాయి. ట్రంప్ , చైనా ప్రధాని లీ పింగ్ మాటల యుధ్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో భారత సంబంధాలు బాగానే ఉన్నా.. చైనా తో అప్పుడప్పుడు మన విభేదాలు కాస్త ఆందోళన కలిగించే అంశమే.. దీన్ని మోడీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య లావాదేవీల ప్రభావాన్ని మోదీ అంచనా వేసి విదేశాంగ విధానంలో మార్పులు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో మోదీ సెప్టెంబరులో భేటీ కానున్నారు. ఆ సందర్భంలో ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయం వారి మధ్య చర్చకు రావచ్చు ప్రస్తుతానికి ఆయిల్ దిగుమతుల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ..గల్ఫ్ దేశాలతో ‘ మైత్రి ‘ ని కొనసాగించవచ్ఛునని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడాన్ని, స్థూల దేశీయ వృద్ద్ధి రేటును ఆయా దేశాలు నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మోదీ తన నూతన మంత్రివర్గంతో దీనిపై చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ సవాళ్ళను ఆయన ఎలా అధిగమిస్తారో వెయిట్ అండ్ సీ.

Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే