తులాభారంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ ఎంపీ

దేవుడికి కానుకగా ఇవ్వాలనుకున్న తులాభారం కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. విషు డే(కేరళ కొత్త సంవత్సరాది) సందర్భంగా శశి థరూర్ తిరువనంతపురంలోని గాంధారి అమ్మాన్ దేవాలయంలో అరటి పళ్లతో తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో పట్టుదప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:36 pm, Mon, 15 April 19
తులాభారంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ ఎంపీ

దేవుడికి కానుకగా ఇవ్వాలనుకున్న తులాభారం కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. విషు డే(కేరళ కొత్త సంవత్సరాది) సందర్భంగా శశి థరూర్ తిరువనంతపురంలోని గాంధారి అమ్మాన్ దేవాలయంలో అరటి పళ్లతో తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో పట్టుదప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శశి థరూర్‌ను తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించామని, ఆయన తలకు 10కుట్లు పడ్డాయని స్థానిక నాయకుడొకరు వెల్లడించారు.