మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు

|

Mar 02, 2021 | 6:01 PM

దేశంలో కొత్తగా 5 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన..

మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌.. నేడు తమిళనాడు.. పాతబస్తీ దాటి పాగా వేసేందుకు పతంగి పార్టీ పావులు
Follow us on

ఒకప్పుడు పాతనగరానికే పరిమితమైన పార్టీ అది.. కంచుకోటను దాటి కదల్లేని స్థితి.. కానీ ఇది ఒకప్పటి మాట.. నేడు పాతబస్తీ దాటడమే కాదు.. పాన్‌ ఇండియా వైపుగా దూసుకెళ్తోంది పతంగి పార్టీ. దేశం నలుమూలలా విస్తరిస్తూ.. ప్రధాన పార్టీలకు సవాల్‌ విసురుతోంది. జాతీయ పార్టీలకే ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశంలో క్రమంంగా విస్తరించేందుకు ఎంఐఎం తన వ్యూహాలకు పదునుపెడుతుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ రాజకీయ చతురత రాటు దేలుతుంది. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

ఎంఐఎం వ్యూహాలు రాటుదేలుతున్నాయి. అసదుద్దీన్‌ రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు. పాతబస్తీ బయట పాగా కోసం ఎత్తుగడ వేస్తున్నారు. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని తేడా లేదు. బలమున్న ప్రతిచోటా పోటీకి దిగుతోంది ఎంఐఎం. మొన్న మహారాష్ట్ర.. నిన్న బీహార్‌లో పోటీకి దిగిన పార్టీ నేడు తమిళనాడు బరిలో దిగుతోంది..

పాతబస్తీ దాటడం ఎలా? పక్క రాష్ట్రంలో పోటీ చేయడం ఎలా..? దీనిపైనే ఫోకస్ పెట్టారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో బహిరంగ ఏర్పాటు చేసింది. పార్టీ 63వ దినోత్సవం సందర్భంగా దారుసలాంలో నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కార్పొరేటర్లు.. పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాషాయం వ్యూహాలకు ఎదురొడ్డి నిలిచింది ఎంఐఎం. బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది పతంగి పార్టీ. తాజాగా.. తమిళనాడులో 22 స్థానాల్లో పోటీకి రెడీ అవుతోంది ఎంఐఎం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. 7, 8 తేదీల్లో ఉమ్మడి వేలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు అసదుద్దీన్‌.

Read more:

సాగునీటి ప్రాజెక్టులపై లోటస్‌పాండ్‌లో విమర్శలు.. షర్మిలది అమాయకత్వమా?.. అజ్ఞానమా? అంటున్న పాలమూరు శ్రేణులు