YS Sharmila convoy accident : షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!

YS Sharmila convoy Accident : కొత్త పార్టీ ఆవిష్కరణ సభకోసం ఖమ్మం వెళుతోన్న వైఎస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం

YS Sharmila convoy accident : షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!
Sharmila Convoy

Updated on: Apr 09, 2021 | 12:56 PM

YS Sharmila convoy accident : కొత్త పార్టీ ఆవిష్కరణ సభకోసం ఖమ్మం వెళుతోన్న వైఎస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మంలో సాయంత్రం 5 వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు షర్మిల. అయితే, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది. ఇవాళ జరిగే సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. అటు, ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తున్నారు. సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

 

Read also : Sharmila : తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భావం .. లోటస్‌పాండ్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన షర్మిల

భగత్ కు ఇదీ.. మెజార్టీ, నాది గ్యారెంటీ.. అంటోన్న తలసాని, సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని జానాకి ఓటెయ్యాలని ప్రశ్న

Loading...
Unable to load recommendations.
Follow Us