Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

పోలీసుల వల్లే వాడు ఉగ్రవాది అయ్యాడు: పుల్వామా ముష్కరుడు అదిల్ తల్లిదండ్రులు

, పోలీసుల వల్లే వాడు ఉగ్రవాది అయ్యాడు: పుల్వామా ముష్కరుడు అదిల్ తల్లిదండ్రులు

పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. దీన్ని వాడు అవమానంగా భావించాడు. రోజూ దాన్నే గుర్తుచేసుకునేవాడు. దీంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు. అప్పడే ఉగ్రవాదుల్లో చేరాలనుకున్నాడు’’ అంటూ అదిల్ తండ్రి గులామ్ హసన్ దర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని వీడాలని తాము చాలా సార్లు అదిల్‌ను కోరామని, కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదని గులామ్ అన్నారు. కానీ ఇలా జవాన్లపై దాడి చేస్తాడని తాము ఊహించలేదని చెప్పారు.

, పోలీసుల వల్లే వాడు ఉగ్రవాది అయ్యాడు: పుల్వామా ముష్కరుడు అదిల్ తల్లిదండ్రులు

కాగా 22ఏళ్ల అదిల్ చదువు ఆపేసి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. కొన్ని నెలల ముందు పుల్వామాకు 10కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్న అదిల్.. అక్కడే జైషే మహ్మద్ ఉగ్రవాదుల ఆధ్వర్యంలో ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ తీసుకున్నాడు. గురువారం భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు కాన్వాయ్‌లో వెళుతున్నారని ముందే తెలుసుకున్న అదిల్ పేలుడు పదార్థాలున్న కారుతో వెళ్లి కాన్వాయ్‌లోని బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో 40మంది జవాన్లు మృతి చెందగా.. మరికొంత మంది గాయపడ్డారు.