అడెళ్ళు కోసం గూడెం జల్లెడ.. డ్రోన్లతో వేట

పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని మావోయిస్టు నేత మైలారపు అడెళ్లు అలియాస్ బాస్కర్ కోసం వేట ముమ్మరమైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో డ్రోన్ల సాయంతో మావోయిస్టు నేత కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఉత్తర తెలంగాణ సరిహద్దు మొదలు...

అడెళ్ళు కోసం గూడెం జల్లెడ.. డ్రోన్లతో వేట
Follow us

|

Updated on: Sep 21, 2020 | 4:45 PM

పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని మావోయిస్టు నేత మైలారపు అడెళ్లు అలియాస్ బాస్కర్ కోసం వేట ముమ్మరమైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో డ్రోన్ల సాయంతో మావోయిస్టు నేత కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఉత్తర తెలంగాణ సరిహద్దు మొదలు మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. గ్రౌండ్ లెవెల్లో గ్రేహౌండ్స్ పోలీసులు.. మహారాష్ట్ర సరిహద్దుకు అటువైపు సీఆర్పీఎఫ్ జవాన్లు అడెళ్ళు అలియాస్ భాస్కర్ ‌కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య పరస్పరం కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడడంతో భాస్కర్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు భావిస్తున్నారు.

మహారాష్ట్,ర తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల పహారా జోరందుకుంది. కడంబ నుండి తప్పించుకున్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెళ్లు అలియాస్ బాస్కర్ కోసం కొనసాగుతున్న పోలీసులు.. తమ ఆపరేషన్‌లో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో అడుగడుగునా నిఘా పెంచారు. కడంబ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఉద్రిక్తత పెరగడంతో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పర్యటిస్తున్న రామగుండం పోలీసు కమిషనర్, ఆసిపాబాద్ జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ, డీసీపి ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం పర్యటించారు.

గూడెం-అహేరీకి చేరుకున్న ఇంఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ గాలింపు చర్యల పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టు నేత కోసం నిఘా పెంచాలని ఆదేశించారు. దాంతో గూడెం-అహేరీ వద్ద డ్రోన్ కెమెరాలతో వేట నిర్వహిస్తున్నారు. కూంబింగ్ కార్యకలాపాలను, పహారాను పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పెంచికల్ పేట, సిద్దేశ్వర గుట్ట, చింతల మానేపల్లి, కడంబ అభయారణ్యాలను గ్రే హౌండ్స్ బలగాలు‌ జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ కెమెరాలతో మంగీ దళంపై నిఘా పెంపొందించినట్లు సమాచారం.