ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాస!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాసగా మారింది. కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదంటూ.. అక్కడున్న పందెం బరులను, టెంట్లను తొలగించారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వెనుదిరిగిన అనంతరం మళ్లీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కోడి పందేల నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వని పక్షంలో.. కోకో.. కబడ్డీ ఆటలు ఆడుతామంటూ స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందేలు. వీటిని అనాధి కాలం […]

ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాస!
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 2:49 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కోడి పందేల నిర్వహణ రసాభాసగా మారింది. కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదంటూ.. అక్కడున్న పందెం బరులను, టెంట్లను తొలగించారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వెనుదిరిగిన అనంతరం మళ్లీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కోడి పందేల నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వని పక్షంలో.. కోకో.. కబడ్డీ ఆటలు ఆడుతామంటూ స్థానికులు పేర్కొంటున్నారు.

కాగా.. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందేలు. వీటిని అనాధి కాలం నుంచి ఏపీ వాసులు సంప్రదాయంగా, భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే.. గతేడాది.. వీటిపై కోర్టులో కేసులు నడవగా.. పోలీసులు ముందస్తుగానే బైండోవర్ కేసులు పెట్టి.. పూర్తిస్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. పందెం రాయుళ్లు మాత్రం పంతం వీడేలా కనిపించడంలేదు.