ఇక పెళ్లి చేసుకోవాలన్నా.. అంత్యక్రియల చేయాలన్నా పర్మిషన్ తప్పనిసరి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం అనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో..

ఇక పెళ్లి చేసుకోవాలన్నా.. అంత్యక్రియల చేయాలన్నా పర్మిషన్ తప్పనిసరి..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 12:58 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం అనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిషా ప్రభుత్వం కరోనా కట్టడి కోసం పలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇక రాష్ట్రంలో వివాహాలు చేసుకోవాలన్నా.. ఏవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాలన్నా.. పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది. బుధవారం నాడు ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వివాహానికి యాభై మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని.. ఇక అంత్యక్రియలకు సంబంధించి కేవలం 2 మందిని మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. పెళ్లికి ఆన్‌లైన్‌లో అప్లే చెయ్యాలని సూచించింది. ఇక ఫంక్షన్‌ హాల్స్‌లో కరోనా నిబంధనలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత ఫంక్షన్‌ హాల్స్‌ యాజమాన్యానిదేనని.. ప్రభుత్వం పేర్కొంది. ఇదిలావుంటే.. అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే పదివేల మార్క్‌ను దాటేసింది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది.