బ్రిటన్ నమూనాలో మోదీ భారీ ప్యాకేజీ

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ బ్రిటన్ మోడల్ లో ఉన్నట్టు చెబుతున్నారు. గత మార్చి నెలలో బ్రిటన్ 30 బిలియన్ పౌండ్లతో మేజర్ ప్యాకేజీ ప్రకటించింది. అది లేబర్ మార్కెట్ కి, హెల్త్ కేర్...

బ్రిటన్ నమూనాలో మోదీ భారీ ప్యాకేజీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 13, 2020 | 11:05 AM

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ బ్రిటన్ మోడల్ లో ఉన్నట్టు చెబుతున్నారు. గత మార్చి నెలలో బ్రిటన్ 30 బిలియన్ పౌండ్లతో మేజర్ ప్యాకేజీ ప్రకటించింది. అది లేబర్ మార్కెట్ కి, హెల్త్ కేర్ సిస్టం కి ఊతమిచ్ఛేదిగా ఉంది. అలాగే బిజినెస్ కార్యకలాపాలను పునరుధ్ధరించేందుకు మరో 30 బిలియన్ పౌండ్లను కూడా ఆ తరువాత బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మోదీ ఎనౌన్స్ చేసిన ప్యాకేజీ కూడా దాదాపు దానిని పోలి ఉంది. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలకు భారీగా రుణాలను, రైతులు, వలస కూలీలకు ఆర్థిక సాయాన్ని చేసేందుకు ఉద్దేశించిన ఈ ఉద్దీపన ప్యాకేజీపై కాంగ్రెస్ వర్గాలు అప్పుడే పెదవి విరిచాయి. అయితే కీలకమైన అన్ని రంగాలకూ ఇది సమగ్ర ప్యాకేజీ అంటోంది మోదీ ప్రభుత్వం. లాండ్, లేబర్, లిక్విడిటీ, అండ్ లా అనే పదాలను ప్రధాని పదేపదే ప్రకటించారు.

ఇక వర్తమాన  ఆర్ధిక సంవత్సరంలో ఇండియా కేవలం 1.5 నుంచి 2.8 శాతం ఆర్థికవృద్దిని మాత్రమే సాధిస్తుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సాధారణంగా ఇది 4.8 శాతం నుంచి 5 శాతం ఉంటుంది.