Women’s Diet Tips: పీరియడ్స్ సమస్యల నివారణకు ఆయుర్వేద చిట్కాలు.. వీటిని తీసుకుంటే ఆ బాధలన్నీ పరార్‌!

|

Jul 29, 2024 | 8:55 PM

అమ్మాయిల వయస్సు పెరిగే కొద్దీ వారి శరీరంలో అంతర్గతంగానూ, బాహ్యంగానూ అనేక మార్పులు వస్తుంటాయి. ప్రత్యేకించి యుక్తవయస్సులో ప్రవేశించినప్పుడు శారీరంలో హార్మోన్ల మార్పులు స్పష్టం తెలుస్తాయి. వాటిలో ఒకటి పీరియడ్స్. అమ్మాయిల్లో రుతుక్రమం అనేది గర్భం దాల్చే సామర్థ్యాన్ని పొందడంలో మొదటి మెట్టును సూచిస్తుంది. ఫలితంగా ప్రతి నెలా రుతుక్రమం వస్తుంది. అమ్మాయిల హార్మోన్ల వ్యవస్థ మొత్తం శరీరంపై ప్రభావితం చూపిస్తుంది..

1 / 5
అమ్మాయిల వయస్సు పెరిగే కొద్దీ వారి శరీరంలో అంతర్గతంగానూ, బాహ్యంగానూ అనేక మార్పులు వస్తుంటాయి. ప్రత్యేకించి యుక్తవయస్సులో ప్రవేశించినప్పుడు శారీరంలో హార్మోన్ల మార్పులు స్పష్టం తెలుస్తాయి. వాటిలో ఒకటి పీరియడ్స్.అమ్మాయిల్లో రుతుక్రమం అనేది గర్భం దాల్చే సామర్థ్యాన్ని పొందడంలో మొదటి మెట్టును సూచిస్తుంది. ఫలితంగా ప్రతి నెలా రుతుక్రమం వస్తుంది. అమ్మాయిల హార్మోన్ల వ్యవస్థ మొత్తం శరీరంపై ప్రభావితం చూపిస్తుంది. పీరియడ్స్‌ కారణంగా వీరిలో త్వరగా ఐరన్ కూడా లోపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
చాలా సార్లు మహిళలు పీరియడ్స్ లేదా మెనోపాజ్ కారణంగా అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. కేవలం కొన్ని సాధారణ ఆహారాలతోనే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా ఉసిరికాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళలకే కాకుండా పిల్లలు, వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పచ్చి ఉసిరి లేదా ఉసిరి పొడి లేదా ఉసిరి రసం ఏదైనా తీసుకొవచ్చు.

3 / 5
బలహీనత నుంచి రక్తహీనత సమస్య వరకు అన్నింటికీ ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖర్జూరాలను సూపర్‌ఫుడ్‌గా మహిళలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది బరువు పెరుగుట, అలసటను తగ్గించడం, ఐరన్ స్థాయిలను పెంచడం, క్రమరహిత పీరియడ్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4 / 5
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కండరాలు, ఎముకల ఆరోగ్యానికి అలాగే నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నువ్వులు అసమతుల్యత సమస్యల కారణంగా మహిళల్లో పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పిత్త, ఆర్థరైటిస్ సమస్యల నుంచి శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని, థైరాయిడ్ సమస్యలను నిర్వహించడంలో కొబ్బరి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఒక చిన్న కొబ్బరి ముక్క తినాలి.

5 / 5
ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి నల్ల ఎండుద్రాక్ష బలేగా ఉపయోగపడుతుంది. కడుపును శుభ్రపరచడానికి, అధిక పిత్తాన్ని తగ్గించడానికి, శరీరానికి పోషకాలను అందించడానికి, మానసిక ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.