Winter Foods: రోగనిరోధక శక్తికి బలాన్నిచే ఆహారాలు ఇవే.. ఈ సీజన్‌లో తప్పక తినాలి

Updated on: Nov 27, 2023 | 12:33 PM

సీజన్ మారేకొద్దీ జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్ధం. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.

1 / 5

2 / 5
చలికాలంలో శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. కాలానుగుణ ఆహారాన్ని తినడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఫలితంగా శరీరాన్ని లోపలి నుంచి నుంచి వెచ్చగా ఉంచుకోవచ్చు. అటువంటి ఆహారాల్లో క్యారెట్లు ముందు వరుసలో ఉంటాయి. క్యారెట్లు ఏడాది పొడవునా లభిస్తుంటాయి. అయితే, శీతాకాలంలో తాజా క్యారెట్లను తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

3 / 5
ఆహారంలో ఆవపిండిని తీసుకోవాలి. ఆవపిండిలో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. ఆవాల్లో ఫోలేట్, ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. చలికాలంలో ఈ కూరగాయలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సీజన్‌లో ఆవాలతో పాటు మెంతికూరను కూడా తినొచ్చు. మెంతికూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెంతుల పొడిని వివిధ వంటలలో కూడా ఉపయోగించవచ్చు.

4 / 5
నువ్వులు శీతాకాలంలో తప్పనిసరిగా తినవల్సిన పదార్థం. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే నువ్వుల లడ్డూ తినవచ్చు.

5 / 5
శీతాకాలంలో పాలకూర తినాలి. పాలకూరను శీతాకాలపు సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.