Beetroot Juice: వావ్.. ఆడవారి ఆరోగ్యానికి బీట్‌రూట్.. రోజూ ఇలా వాడితే శరీరంలో కలిగే మార్పులు ఇవే.!

|

Dec 31, 2024 | 5:18 PM

బీట్‌రూట్ ప్రకృతి సహజంగా పోషకాలతో నిండిన కూరగాయ. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
బీట్‌ రూట్‌ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీట్‌ రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్‌, ఇతర పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్‌లో విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. దీంతో మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్‌రూట్ మంచి పోషకాహారం. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలకు బీట్‌రూట్‌ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు బీట్‌ రూట్‌ని తరచూ తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. ఇందులో ఉండే ఫొలేట్‌, విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీంతో గర్భిణీలకు మంచిది.

3 / 5
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ ఉన్నవారు తరచూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎందుకంటే రక్తపోటును తగ్గించే నైట్రేట్‌ పోషకం బీట్‌రూట్‌లో సమృద్ధిగా ఉంటుంది. హైపర్‌ టెన్షన్‌తో ఇబ్బంది పడేవారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

4 / 5
బీట్‌ రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల లివర్ పై కొవ్వు పేరుకు పోకుండా నివారిస్తుంది. ఇందులోని పోటాషియం అధికంగా ఉంటుంది దీని వల్ల నరాలు, కండరాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చర్మ రక్షణలో కూడా ఏంతో దోహదపడుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఉండే ఫ్రీరాడికల్స్‌, బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.

5 / 5
అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.