సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా చూశారో మీకే నష్టం..

Updated on: Mar 07, 2026 | 8:09 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో.. సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన ఎండలు, వేడి గాలుల కారణంగా వడదెబ్బ , డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచే సహజ సిద్ధమైన మార్గాలపై ఆయుర్వేద నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

1 / 5
శరీరానికి సబ్జా రక్షణ కవచం: వేసవిలో మన శరీరం చెమట రూపంలో నీటిని, ఖనిజ లవణాలను వేగంగా కోల్పోతుంది. దీనివల్ల తలతిరుగుడు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే మన వంటింట్లో దొరికే సబ్జా గింజలు అత్యుత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
అద్భుత ప్రయోజనాలు: సబ్జా గింజలకు శరీరాన్ని తక్షణమే చల్లబరిచే గుణం ఉంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. ఈ గింజలు నీటిని పీల్చుకుని జెల్ లాగా మారతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉంటుంది.

3 / 5

జీర్ణక్రియ మెరుగు: వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సబ్జాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

4 / 5
గుమ్మడి గింజలు: సబ్జాతో పాటు గుమ్మడి గింజలను కూడా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి, ఎముకల పుష్టికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ స్నాక్.

5 / 5
ఎలా తీసుకోవాలి?: ఆరోగ్యంగా ఉండటానికి సబ్జా నీటిని తయారు చేసుకునే విధానం చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సబ్జా గింజలను వేసి..10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె లేదా పటిక బెల్లం కలుపుకుని తాగవచ్చు. కృత్రిమ కూల్ డ్రింక్స్‌ జోలికి వెళ్లి ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే.. ప్రకృతి ప్రసాదించిన ఈ సబ్జా గింజలను అలవాటు చేసుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us