Road Lines Markings: రోడ్లపై తెలుపు, ప‌సుపు రంగు గీత‌లు ఎందుకు ఉంటాయో తెలుసా..?

|

Aug 16, 2022 | 4:02 PM

Road Lines Markings: రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా పెట్టించుకోము. చాలా మందికి కొన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా రోడ్ల వెంట..

1 / 6
Road Lines Markings: రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా పెట్టించుకోము. చాలా మందికి కొన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. ముఖ్యంగా రోడ్ల వెంట వెళ్తున్నప్పుడు రహదారులపై తెల్లటి, పసుపు రంగు, నల్లటి రంగు లాంటి గీతలు చూస్తుంటాము. కానీ అలాంటి గీతలను పెద్దగా పట్టించుకోము. వాహనదారులు రోడ్లపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి. అందుకే ట్రాఫిక్‌ గుర్తులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం ముఖ్యం. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా విధిగా చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు,జరిమానాలు తప్పవు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, గుర్తులనే కాకుండా రహదారిపై ఉండే గీతల గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. రోడ్లపై తెలుపు, పసుపు రంగుల్లో గీతలను చూసి ఉంటారు. అసలు ఆ గీతలు ఎందుకుంటాయి..? వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం.

2 / 6
రోడ్డుపై తెలుపు రంగు కంటిన్యూగా ఒకటే ఉంటే వాహనదారులు తమకు కేటాయించిన లైన్‌లోనే వెళ్లాలని అర్థం. ఇత‌ర లైన్‌లోకి వెళ్లరాదని గుర్తించుకోవాలి. అలా వెళ్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే. వాహనదారులు లైన్‌ ఛేంజ్‌ కావచ్చని అర్థం. అలా లైన్‌ను మార్చేటప్పుడు దిక్కులను చూస్తూ జాగ్రత్తగా వెళ్లాలని అర్థం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

3 / 6
అక్కడక్కడ మధ్యలో బ్రేకులతో కూడిన తెలుపు రంగు గీత ఉంటే..వాహనదారులు లైన్‌ ఛేంజ్‌ కావచ్చని అర్థం. అలా లైన్‌ను మార్చేటప్పుడు దిక్కులను చూస్తూ జాగ్రత్తగా వెళ్లాలని అర్థం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

4 / 6
పసుపు రంగు గీత: రోడ్డుపై పసుపు రంగు గీత నీటారుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులు ఓవర్‌టెక్‌ చేయవద్దని అర్థం. అయితే పసుపు రంగు గీత మాత్రం దాటకుండా చూసుకోవాలి. ఈ గీత అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండవని గుర్తించుకోవాలి. ప్రాంతాలను, రద్దీని బట్టి ఉంటుంది. అదే తెలంగాణలో అయితే ఇలాంటి ప‌సుపు గీత ర‌హ‌దారిపై ఉంటే ఓవ‌ర్ టేకింగ్ చేయ‌కూడ‌ద‌ని అర్థం వ‌స్తుంది.

5 / 6
రెండు పసుపు రంగు గీతలుంటే..: రహదారిపై దృఢమైన పసుపురంగు రెండు గీతలుంటే ఓవర్‌టెకింగ్‌కు నిషేధమని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులు ఓవర్‌టెక్‌ చేయకుండా ఉండాలని అర్థం. ఆ రెండు గీతలున్న ప్రాంతంలో ఓవర్‌టెక్‌ పూర్తిగా నిషేధం అని గుర్తించుకోవాలి.

6 / 6
రెండు పసుపు గీతలు ఉండి.. ఒక వైపు మధ్య మధ్యలో బ్రేక్‌ ఉంటే..: రోడ్డుపై రెండు పసుపు గీతలు ఉండి, అందులో ఒక వైపు కంటిన్యూగా గీత వచ్చి, మరో వైపు మధ్య మధ్యలో బేక్‌ ఇస్తూ గీత ఉంటే గీత వైపు ఓవర్‌టెక్‌ చేయకూడదని, బ్రేక్స్‌ వచ్చిన గీత వైపు ఓవర్‌ టెక్‌ చేయవచ్చని అర్థం.