
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రాత్రి వేళలో తీసుకుంటే సరిగా జీర్ణం కాక కొత్త సమస్యలు వస్తాయి. ఇది నరాల వ్యవస్థ ను యాక్టీవేట్ చేసి బ్లడ్ ఎక్కువగా ఫ్లో అయ్యి నరాలు గట్టిగా అయ్యేలా చేస్తుంది. దీంతో నిద్ర లేమి సమస్యలు మొదలవుతాయి. ఒక వేళ మీరు తీసుకోవాలనుకుంటే రాత్రి సమయంలో తీసుకోకండి.

జుట్టు : ఈ సీజన్ లో జుట్టు రాలడం సమస్య ఎదుర్కొంటున్నారా? అలా అయితే, ఈ రోజు నుండే ఉసిరి తినడం అలవాటుగా చేసుకోండి. దీనిలోని పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. మెరుపును పునరుద్ధరిస్తాయి. మీరు ఇంట్లో మీ జుట్టును బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీ ఆహారంలో ఆమ్లాను చేర్చుకోండి.

Amla

ప్రెగ్నెంట్ మహిళలు , పాలిచ్చే తల్లులు ఉసిరితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న ఆడవాళ్ళు ఉసిరిని తింటే అది నేరుగా జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. దీని వలన వారికీ విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది.

ఉసిరిలో శరీరంకు మేలు చేసే అనేక గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉసిరి తింటే శరీరంకు విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీనిలోని పుల్లని గుణాలు శరీరంలోని మలబద్దకంను నివారిస్తాయి. జీవక్రియల్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.