Tongue Color: ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఎందుకు నాలుక చూస్తారో తెలుసా? దీని వెనుక అసలు రహస్యం ఇదే

|

Sep 16, 2024 | 1:35 PM

పసుపు చర్మం, పసుపు కళ్ళు.. కామెర్ల వ్యాధికి సంకేతాలు. అలాగే నాలుక రంగు కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెప్పగలదు. నాలుక రంగు మీ శరీరంలోని వివిధ వ్యాధులను సూచిస్తుంది. ఎప్పుడైనా డాక్టర్ వద్దకు వెళితే, డాక్టర్ చేసే మొదటి పని మీ నాలుకను చూడటం. నిజానికి, నాలుకను చూసి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నాలుక రంగులు ఏయే వ్యాధిలను సూచిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
మీ నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. తెల్ల మచ్చలు తరచుగా పిల్లలు లేదా వృద్ధులలో కనిపిస్తాయి. తెల్లటి నాలుక నిర్జలీకరణంతో సమస్యను సూచిస్తుంది. ల్యూకోప్లాకియాలో కూడా నాలుక తెల్లగా కనిపిస్తుంది. అలాగే నాలుక నల్లగా ఉంటే గొంతులో ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియాకు సంకేతం. ఎక్కువగా మందులు వాడేవారిలో కూడా నాలుక నల్లగా మారుతుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా నాలుక నల్లగా ఉంటుంది. క్యాన్సర్ రోగుల్లోనూ నాలుక నల్లగా ఉంటుంది. కడుపు పూతల సమస్యతో బాధపడేవారిలో నాలుక రంగు మారుతుంది. కాబట్టి అటువంటి లక్షణాలు కనిపిస్తే, ముందుగా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

3 / 5
పసుపు నాలుక కామెర్ల లక్షణం. కానీ ఇది ప్రారంభ సంకేతం మాత్రమే. ఇలా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నీలం లేదా గోధుమ రంగు నాలుక ప్రమాదకరం. గోధుమ నాలుక గుండె సమస్యలకు సంకేతం. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు నాలుకపై గోధుమ రంగు పూత ఏర్పడుతుంది.

4 / 5
నాలుక పూర్తిగా లేత లేదా లేత గులాబీ రంగులో ఉంటే శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తహీనత, విటమిన్ B-12 లోపం కూడా దీనికి కారణం కావచ్చు. ఇలా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

5 / 5
అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల నాలుక రంగు ఎలా ఉండాలి? అనే సందేహం మీకూ వచ్చిందా.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముదురు గులాబీ రంగులో లేత తెల్లటి పూతతో, మచ్చలు లేకుండా నాలుక ఉండటం ఆరోగ్యకరం. నాలుకపై తేమ లేకపోవడం కూడా వ్యాధికి సంకేతమని గుర్తుంచుకోండి.