
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా, రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ద్రోణి ప్రభావంతో గురువారం (26-11-2026) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

మిగిలిన జిల్లాల్లోను చేదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి రాయండి సీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.. రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.