
కావాల్సిన పదార్దాలు : 20 వామాకు ఆకులు, ఒక కప్పు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొద్దిగా పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా నూనె, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, నాలుగు ఆవాలు, చిటికెడు జీలకర్రను తీసుకోవాలి.

మీరు ముందుగా వామాకును తీసుకుని నీళ్లలో మంచిగా కడగాలి. ఆ తరువాత గ్యాస్ వెలిగించి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు, నాలుగు ధనియాలు, కొద్దిగా నువ్వులు వేసి ఇంకా దోరగా వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించి, పచ్చిమిర్చి దీనిలో రంగు మారే వరకు దీనిలో వేయాలి.

ఇప్పుడు మీరు కడిగి పెట్టుకున్న వామాకు ఆకులను తీసుకుని ఒక మీడియం సైజు లో వేసి మీడియం ఫ్లేమ్‌పై మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇంకా అలాగే అన్నింటిని చల్లారనివ్వండి. మీరు ఇలా చేస్తే వామాకు పచ్చడి మంచిగా ఉంటుంది. ఇంకా దీనిలో వేయించిన పప్పులు, నాలుగు నువ్వులు, అలాగే నాలుగు వెల్లుల్లి, అలాగే చింతపండు, పసుపు కూడా దీనిలో వేసి పొడిలా వేయాలి.

ఆ తర్వాత దీనిలో వేయించిన వామాకు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు కూడా కలిపి దీనిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇంకా దీనిలో నీరు కూడా వేసుకోవాలి. అలాగే, పోపు పెట్టి ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఆవాలు, నాలుగు జీలకర్ర, నాలుగు పప్పులు, వెల్లుల్లి రెబ్బలు , 10 కరివేపాకు, ఇంగువను వేసి మంచి వాసన వస్తుంది.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)