
వేసవికాలం వచ్చిందంటే చాలు.. బాడీలో వేడి ఎక్కువవుతుంది. అలాగే అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు మార్కెట్‌లో కొత్త కొత్త కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, పాతకాలంలో మన తాతలు నేచురల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసాయని చెబుతున్నారు. చోళుల కాలం నాటి సాంప్రదాయ పానీయాల్లో పానకం కూడా ఒకటి.

అయితే, తమిళ ప్రాంతాల్లో ఈ పానీయాన్ని చోళుల కాలం నాటి ఎంతో ఫేమస్. ఇది సాధారణ డ్రింక్ లా కనిపించినా, దీనిలో వేసే సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఆకులు కూడా బాడీకి చల్లదనాన్ని ఇస్తాయి. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఒక గ్లాస్ పానకం తాగితే కొద్దీ నిముషాల్లోనే బాడీ మొత్తం కూల్ అయ్యేదని అంటున్నారు. దీనిని ఎలా చేయాలంటే?

పానకం ఎలా తయారు చేయాలంటే? ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బెల్లం కలిపి దీనిని బాగా కరిగించాలి. ఆ తర్వాత దీనిలో చెరుకు రసం, మిరియాల పొడి, యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపితే రుచికరమైన పానకం రెడీ. చాలా మంది పండుగలలో సమయంలో ఈ పానకం ప్రత్యేకంగా చేసుకుని తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ పానకం వల్ల కలిగే లాభాలు ఇవే : పానకం తాగిన తరవాత శరీరంలో వేడి మొత్తం తగ్గిపోయి సమ్మర్లో హీట్ స్ట్రోక్ ను కూడా తగ్గిస్తుంది. ఇంకా దీనిలో వేసే బెల్లంలో షుగర్ కంటెంట్ శరీరానికి ఎంతో పవర్ ను ఇస్తుంది. అలాగే మిరియాలు, యాలకులు కూడా జీర్ణక్రియను కూడా మెరుగుపరచి కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

అయితే, దీనిలో కొంచం ఎక్కువ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి. వైద్యున్ని సంప్రదించి తాగండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)