వీటి విషానికి చావు కూడా గజగజలాడాల్సిందే.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పాములు ఇవే..

Updated on: Mar 31, 2026 | 8:11 PM

ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయో, అన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా పాము అనే పేరు వినగానే వెన్నులో వణుకు పుట్టడం సహజం. భూమిపై వేల సంఖ్యలో పాముల జాతులు ఉన్నప్పటికీ, అందులో కొన్ని మాత్రం సాక్షాత్తు యమధర్మరాజుతో సమానం. కేవలం ఒక్క కాటుతో ఏనుగులను సైతం కుప్పకూల్చే విషనాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఇన్‌ల్యాండ్ టైపాన్: దీనిని ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అన్ని పాముల కంటే ఇది అత్యంత విషపూరితమైనది. ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతాల్లో నివసించే ఈ పాము ఒక్కసారి విడిచే విషంతో 100 మంది మనుషులను చంపవచ్చు. దీని విషం నేరుగా గుండె, ఊపిరితిత్తుల పనితీరును నిలిపివేస్తుంది. అయితే, ఇది మనుషులకు దూరంగా ఉండటానికే ఇష్టపడుతుంది.

2 / 5
బ్లాక్ మాంబా: ఆఫ్రికా ఖండానికి చెందిన బ్లాక్ మాంబా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పాము. ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. దీని నోటి లోపలి భాగం నల్లగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కాటు వేసిన 20 నిమిషాల్లోనే మనిషి కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంది. దీనికి కోపం ఎక్కువ, ఎదురుగా ఎవరున్నా పదే పదే కాటు వేయడం దీని నైజం.

3 / 5
కింగ్ కోబ్రా: ఆసియా అడవుల్లో కనిపించే రాజనాగు ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది విడిచే విషం ఎంత శక్తివంతమైనదంటే, ఒక భారీ గజరాజు సైతం దీని కాటుకు కొన్ని గంటల్లోనే ప్రాణాలు వదులుతుంది. ఇది ఇతర పాములను కూడా ఆహారంగా తీసుకుంటుంది.

4 / 5
సా-స్కేల్డ్ వైపర్ :  ప్రపంచవ్యాప్తంగా పాము కాటు మరణాలకు ప్రధాన కారణం ఈ చిన్న పామే. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ వైపర్, ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తన పొలుసులను రుద్దుతూ రంపపు శబ్దాన్ని చేస్తుంది. దీని విషం రక్తాన్ని పలచబరిచి, అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది.

5 / 5
కోస్టల్ టైపాన్: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో ఉండే ఈ పాము అత్యంత దూకుడు స్వభావం కలది. దీని వేగం ఎంత ఉంటుందంటే, బాధితుడికి తను కాటుకు గురయ్యాననే విషయం తెలిసేలోపే ఇది పదే పదే కాటు వేసి వెళ్ళిపోతుంది. దీని విషం శరీరంలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే అరగంటలోనే మరణం సంభవిస్తుంది.

Follow Us