Winter Weight Loss Tips: ఈ డ్రింక్స్‌ శీతాకాలంలో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయ్‌.. మీరూ ట్రై చేయండి

|

Dec 10, 2023 | 7:32 PM

శీతాకాలంలో దొరికే కూరగాయలు, పండ్లు చాలా పోషకమైనవి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి సులువుగా పెంపొందుతుంది. తద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. కానీ శీతాకాలంలో బరువు తగ్గడానికి తాజా కూరగాయలు, పండ్లు మాత్రమే తింటే సరిపోదు. చలికాలంలో చాలా మంది తక్కువ నీరు తాగుతుంటారు. శరీరంలో హైడ్రేషన్ లేకపోతే బరువు తగ్గడం కష్టం. కాబట్టి బరువు తగ్గడానికి..

1 / 5
శీతాకాలంలో దొరికే కూరగాయలు, పండ్లు చాలా పోషకమైనవి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి సులువుగా పెంపొందుతుంది. తద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. కానీ శీతాకాలంలో బరువు తగ్గడానికి తాజా కూరగాయలు, పండ్లు మాత్రమే తింటే సరిపోదు. చలికాలంలో చాలా మంది తక్కువ నీరు తాగుతుంటారు. శరీరంలో హైడ్రేషన్ లేకపోతే బరువు తగ్గడం కష్టం. కాబట్టి బరువు తగ్గడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడే 5 వేడి పానీయాలు నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి. ఈ పానీయంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3 / 5
వేడివేడిగా దాల్చిన చెక్క టీ తాగవచ్చు. దాల్చిన చెక్క టీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. వేడి నీళ్లలో దాల్చిన చెక్క పొడి లేదా కర్రను వేసి మరిగించాలి. తర్వాత దీనిలో తేనెతో కలిపి తాగాలి.

4 / 5
చలికాలంలో రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగాలి. వేడి పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి, రుచి కోసం తేనెను జోడించవచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

5 / 5
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. వేడి నీటిలో అల్లం చూర్ణం వేసి, బాగా మరిగాక వడకట్టి తేనె కలిపి తాగాలి. ఈ టీ జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.