ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేసింది. ప్యాడ్ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్ జూన్ 13 తేదీ నుంచి అందుబాటులోకి వస్తోంది.
షావోమీ ప్యాడ్ 5 పేరుతో తీసుకొచ్చిన ట్యాబ్లెట్ బేస్ వేరియంట్.. 6GB + 128GB RAM స్టోరేజ్ ధర రూ. 26,999. ప్రారంభ ఆఫర్ కింద రూ.1000 తగ్గింపుతో రూ. 25,999కే లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2,000 తగ్గింపు కూడా లభిస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 10.95 ఇంచెస్ 2.5కే+ డిస్‌ప్లేను అందించారు. ఇక ట్యాబ్లెట్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 SoCని అందించారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 12పై MIUI 13 తో పని చేస్తుంది.
ఈ ట్యాబ్లెట్‌లో డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో పాటు క్వాడ్ స్పీకర్‌లను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 8,720mAh బ్యాటరీని అందించారు.