చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా భారత మార్కెట్లోకి వివో టీ1 ఎక్స్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. జూలై 27 నుంచి తొలి సేల్ ప్రారంభం కానుంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను ఇచ్చారు, అలాగే సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999, 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999, 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌రూ. 14,999గా ఉంది.
రెండు కలర్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ మొదటి సేల్ జులై 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.