Vivo Y18i: రూ. 8వేలలో సూపర్‌ ఫీచర్స్‌.. వివో నుంచి కళ్లు చెదిరే ఫోన్‌

|

Aug 25, 2024 | 1:59 PM

మార్కెట్లో బడ్జెట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా రూ. 10వేల మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వివో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై18ఐ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై78ఐ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
వివో వై18ఐ స్మార్ట్‌ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక 528 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో ఈ ఫోన్‌ను సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత టచ్‌ ఓఎస్‌ 14 వెర్షనపై ఈ ఫోన్‌ చేస్తుంది. ఇందులో 15 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెసాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 0.08 ఎంపీతో కూడిన సెకండ్‌ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
కనెక్టివిటీ వియానికొస్తే ఈ ఫోన్‌లో..  వై-ఫై5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.యాక్సెలరో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ వంటి వాటిని అందించారు.