Best Laptops Under 30K: విద్యార్థులకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. చవకైన ధర.. సూపర్ ఫీచర్లు.. మిస్ చేసుకోవద్దు..

|

Jul 21, 2023 | 6:00 PM

చదువులు కూడా డిజిటల్ బాట పట్టాయి. కరోనా తర్వాత కాలంలో విద్యార్థులు ట్యాబ్ లేదా ల్యాప్ టాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అది వారికి అవసరంగా మారిపోయింది. అయితే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ల్యాప్ టాప్ కొనుగోలు చేయడం కాస్త కష్టమైన పనే. పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండే ల్యాప్ టాప్ లలో మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లుండే వాటిని ఎంపిక చేసుకోవడం అంతా సులువు కాదు. అది కూడా తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు కావాలంటేమాత్రం వాటిపై మీకు పూర్తి అవగాహన ఉండాల్సిందే. అందుకనే మీకోసం మేమే ఆ పనిచేసిపెడుతున్నాం. రూ. 30,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..

1 / 5
ఆసుస్ వివోబుక్ గో 15.. దీనిలో సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్  మెమరీ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఎన్ 4500 ప్రాసెసర్ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అయితే డిజైన్ అంత క్వాలిటీగా అనిపించవచ్చు. కీ బోర్డ చాలా స్టైలిష్, సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి టైపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది కూడా 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,990గా ఉంది.

2 / 5
హెచ్‌పీ క్రోమ్ బుక్ 15.6.. మీరు దృఢమైన ల్యాప్ టాప్ కోసం చూస్తున్నట్లు అయితే మీకిదే బెస్ట్ చాయిస్. ఇది బ్లూ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. అయితే దీని డిస్ ప్లే, వెబ్ క్యామ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఇది పక్కన పెడితే దీనిలో ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్క్‌లను సులభంగా నిర్వహించగలుగుతుంది. సాధారణ వెబ్ బ్రౌజింగ్ లేదా కంటెంట్‌ను చూడటం వరకూ అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ల్యాప్ టాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మేనేజ్ చేయొచ్చు. దీని ధర మనదేశంలో రూ. 28,999గా ఉంది.

3 / 5
ఇన్ఫినిక్స్ ఐఎన్ బుక్ వై1 ప్లస్.. ఇది అత్యంత స్టైలిష్ ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా నిలుస్తుంది. దీనిలో 10వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మల్టీ టాస్క్‌లను హ్యాండిల్ చేస్తుంది. అయితే ఇది అప్పుడప్పుడు  హ్యాంగింగ్ సమస్యను ఎదుర్కొంటుంది. ల్యాప్‌టాప్ స్లిమ్ బెజెల్స్‌తో 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మల్టీమీడియా వినియోగ ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 28,990గా ఉంది.

4 / 5
హెచ్‌పీ 255 జీ8.. ఒకవేళ మీరు హెచ్ పీ ల్యాప్ టాప్ నే కొనుగోలు చేయాలని భావించే క్రోమ్ బుక్ ను వద్దనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఇది ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.  డెస్క్‌టాప్ యాప్‌లతో పరిమిత వినియోగాన్ని కలిగి ఉండే ఉపాధ్యాయులు లేదా వైద్యులు వంటి నిపుణులకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఏఎండీ రైజెన్ 3 సిరీస్ సీపీయూతో వస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 29,990గా ఉంది.

5 / 5
లెనోవో ఐడియాప్యాడ్ 1.. దీనిలో 11.6-అంగుళాల చిన్న డిస్‌ప్లేతో వస్తుంది. ల్యాప్‌టాప్ చక్కని సిల్వర్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. ఇది అత్యంత పోర్టబుల్‌గా ఉంటుంది. రోజువారీ పనికి, మీరు వెబ్‌ని బ్రౌజ్ చేయడానికి లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్యూట్ లో పని చేయడానికి అయితే ఇది సరిపోతుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. ఇది విండోస్ 11 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ ధర రూ. 25,289గా ఉంది.