Galaxy A05: సామ్‌సంగ్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 12 వేలకే 50 ఎంపీ కెమెరా..

|

Nov 28, 2023 | 6:40 PM

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
దక్షిణకొరియాకు చెందిన సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఈ కామర్స్‌ సైట్స్‌తో పాటు, సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 12,499గా నిర్ణయించనున్నారు. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్‌ సమయంలో కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు.

3 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1,600 x 720 పిక్సెల్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు.

4 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ OneUI 5.1తో రన్ అవుతుంది. ఇక బ్యాటరీ వవిషయానికొస్తే ఇందులో 25 ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

5 / 5
కెమెరాకు సైతం ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సైడుకు అందించారు.