
ఇటీవల వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా నార్జో 50 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 24న భారత మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

మీడియా టెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్‌ను గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్ 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది.

కెమెరా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఫోన్ స్ట్రక్ కాకుండా డైనమిక్ ర్యామ్ ఫీచర్‌ను అందించారు.

అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్న ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 15,999, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 17,990కి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.