Oppo A3x 4G: మార్కెట్లో రచ్చ చేస్తున్న కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ బడ్జెట్‌లో ఇలాంటి ఫీచర్లు..

|

Oct 27, 2024 | 1:41 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థలు మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగ తక్కువ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ3ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది ఒప్పో ఏ3ఎక్స్‌ పేరుతో 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

2 / 5
ఒప్పో ఏ3ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ క్వాల్‌కామ్ అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

3 / 5
కెమెరా పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌కు సపోర్ట్‌ చేసే రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999గా నిర్ణయించారు.

5 / 5
మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.