Nokia 2780: నోకియా నుంచి మరో సూపర్ ఫీచర్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే..

|

Nov 25, 2024 | 9:24 PM

ఓవైపు స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోన్న ప్రస్తుత తరుణంలో ఫీచర్‌ ఫోన్‌లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖ ఫోన్‌ తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి ఇప్పటికే ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి కొత్త ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోకియా 2780 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.7 ఇంచెస్‌తో కూడిన QVGA డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌ మోడల్‌లో తీసుకొచ్చారు.

2 / 5
ఫోన్‌ను ఫోల్డ్‌ చేసిన తర్వాత అవుటర్‌ డిస్‌ప్లేను 1.77 ఇంచెస్‌తో ఇచ్చారు. ఈ ఫోన్‌ను బ్లూ, రెడ్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ 4జీ వోల్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫైకి కూడా కనెక్ట్‌ చేసుకోవడం ఈ ఫోన్‌ విశేషం.

3 / 5
బ్లూటూత్‌ 4.2, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఆప్షన్స్‌ను అందించారు. ఇందులో యూట్యూబ్‌, మ్యాప్స్‌ వంటివి యాక్సెస్‌ చేసుకోవచ్చు. నోకియా 2780 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని అందించారు.

4 / 5
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు ఇంటర్నల్‌ స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. tures

5 / 5
ఇక ఇందులో 1450 ఎమ్‌హెచ్‌ కెపాసిటీతో కూడిన రిమూవబుల్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే ఏకంగా 18 రోజుల స్టాండ్ బై అందిస్తుంది. అలాగే 7 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ధర విషయానికొస్తే రూ. 6 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.